Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్. కమ్యూనిస్టు ప్రణాళిక అమలు రోజైనటువంటి ఫిబ్రవరి 21 నీ ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా శ్రేణులు, వామపక్ష ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ఒక్క పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి రెడ్ బుక్కు డే కార్యక్రమాన్ని సామూహిక అధ్యయనం చేపడుతున్నాం. దానిలో భాగంగా శుక్రవారం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ రాజకీయ సమీక్షా నివేదిక పై సామూహిక ధ్యయనం- చర్చా జరిగింది . ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళిక ప్రజల ముందు ఉంచబడిందని ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిజమే మార్గమని అన్నారు .ప్రజా సమస్యల పరిష్కారానికి సరైన రూపొందిస్తూ అనేక దేశాలలో ఎర్రజెండా అధికారంలోకి వస్తుందని దానికి అనుగుణంగా మన ప్రాంతంలో కూడా వామపక్షాల వైపు యువత నిలబడాలని, అరకంగా అధ్యయనం చేయాలని దానిలో భాగంగానే ఏదైనా కార్యక్రమం అన్నారు.. ఈ కార్యక్రమం జిల్లా కమిటీ సభ్యులు జె.రాజేందర్, గొడిసెల కార్తిక్, గేడం టికానంద్, నాయకులు శ్రావణి, శ్రీకాంత్ పాల్గోన్నారు.