Listen to this article

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జర్పించాలి ఎస్ యఫ్ ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు కొరుస వంశీ

పిబ్రవరి 22: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగుర్ వెంకటాపురం మండలం లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న సుమ ప్రవేట్ పాఠశాలలో సర్వే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ ఉపాధ్యక్షులు కొరస వంశీ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న సుమ ప్రైవేట్ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎండకు ఎన్నుతున్నారు వర్షానికి నానుతున్నారు అదే విధంగా రేకుల షెడ్డు ఉండటం వలన ఎండకు రేకుల కింద ఉన్న విద్యార్థులకు వేడి ఉండటం వలన పేద మధ్యతరగతి విద్యార్థులు ఆ ప్రైవేట్ పాఠశాలలో ఉండలేని పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా పాఠశాలలో పూర్తిస్థాయిలో తరగతి గధుల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది దాంతోపాటు క్వాలిఫికేషన్ టీచర్స్ ఉన్నారో లేదో అని విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చందు, కిరణ్ ,సాయి నరేష్ తదితరులు పాల్గొన్నారు