Listen to this article

జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో చేపట్టిన కేసుల పరిష్కారంతో కక్షిదారులకు అదనపు లాభాల కలుగుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంవి రమేష్ అన్నారు. మార్చి 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, అడ్వకేట్లతో లీగల్ సర్వీసెస్ డిస్టిక్ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జీ యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మితో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 8వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో మొట్టమొదటి లోక్ అదాలత్ అన్నారు. వేల కేసుల పరిష్కారం లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.లోక్ అదాలత్ తో కక్షిదారులకు లాభాలు కలుగుతాయన్నారు. గ్రామాల్లో చాయతీలతో పరిష్కరించుకునే సమస్యలకు ఎటువంటి చట్టబద్ధత ఉండదని, గడవుకాలం, బైండింగ్ చేసే అవకాశం ఉండదని లోక్ అదాలత్ తో వాటిని పొందే అవకాశం ఉంటుందన్నారు. క్రిమినల్ కేసులను కూడా కాంపౌండ్ చేయడానికి అవకాశం ఉందన్నారు. పేదవారికి న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకంగా జిల్లా ర్టుతోపాటు సీనియర్ సివిల్, జూనియర్ సివిల్ కోర్టులలో ఒక్కొక్కరిని అడ్వకేట్లుగా నియమించిందని పేద ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించాలన్నారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం దిశగా పోలీసులు, అడ్వకేట్లు కృషి చేయాలని అన్నారు. ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 24(సోమవారం) నుండి ముందస్తు లోక్ అదాలత్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మార్చి 8 వరకు కేసుల పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు అడ్వకేట్లు పాల్గొన్నారు.