

జనం న్యూస్ ఫిబ్రవరి 21 కాట్రేనికోన, (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని మగసాని తిప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సమావేశం జరిగింది. శుక్రవారం అమలాపురం ఆర్డీవో కె మాధవి, డీఎస్పీ టి ఎస్ ఆర్ కే ప్రసాద్, సీఐ మోహన్ కుమార్, ఎస్సై అవినాష్, తహసిల్దార్ సునీల్ కుమార్ లు మగసాని తిప్పలోని భైరవ స్వామి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు, జరగకుండా కట్టు దట్టమైన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.