Listen to this article

*CPIML మాస్ లైన్ ఉద్యమ అభివృద్ధికి కార్యకర్తలు అందరూ పట్టుదలతో కృషి చేయాలి .CPIML పార్టీ రాష్ట్ర నాయకులు K. రంగారెడ్డి

పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల CPIML పార్టీ ముఖ్యమైన సభ్యులతో చర్లలో పార్టీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. దీనికి కామ్రేడ్ పాలెం చుక్కయ్య అధ్యక్షత వహించారు. సమావేశానికి ముందు చుక్కయ్య జెండా ఆవిష్కరించారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు K. రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి. ఆదుకోలేక పోతున్నాయనిఆరోపించారు. మిర్చి కింటాకు 24 వేల నుండి 9వేలకు పడిపోయిన పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం క్వింటాకు 35000 ధర కల్పించి ప్రభుత్వ కొనుగోలు చేయాలని అక్రమ వ్యాపారుల దోపిడీని అరికట్టాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు కెచల కల్పన.డివిజన్ నాయకులు దాసరి సాయన్న, మునిగిల శివ ప్రశాంత్, సిమిడి సుజాత. నూతన మండల కార్యదర్శి పాలెం చుక్కయ్య మాట్లాడుతూ మండలంలో మాస్ లైన్ ఉద్యమం
అభివృద్ధికి పాటుపడదామని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాలెం నాగరాజు తన్నూరి లక్ష్మి , సరళ, కల్లూరు కృష్ణ కల్లూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

                              ఇట్లు 
      CPIML మాస్ లైన్ పార్టీ 
      చర్ల మండల కార్యదర్శి 
       పాలెం చుక్కయ్య. 
      8019551858