

జనం న్యూస్ ఫిబ్రవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ డివిజన్ పరిధిలో పెండింగ్ పనులపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులకు సూచిస్తూ పెండింగ్లో ఉన్న సిసి మరియు బిటి రోడ్ల తో పాటు దాసరి బస్తి కమ్యూనిటీ హాల్,కెమికల్ నాలా రిటైనింగ్ వాల్,స్మశాన వాటికలలో మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోరావాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ భాగం డిఈ నిఖిల్ రెడ్డి, ఇంచార్జి ఏ ఈ ఆశ,అసిస్టెంట్ ఏఈ కవిత,వర్క్ ఇన్స్పెక్టర్ రాములు సమావేశంలో పాల్గొనడం జరిగింది