

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యాలు లేక వైద్యంఅందక, అనారోగ్యబారినపడి గిరిజన ప్రజలు మృతి చెందుతున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లా క్కునూరు మండలం పెదరావి గూడెం పంచాయతీలోని బండారిగూడెంలో ముచికి దేవమ్మ అనే గిరిజన మహిళా మృతి చెందిందన్నారు. డోలి మోతలు లేని గ్రామాలను చూస్తారని చెప్పిన కూటమి ప్రభుత్వం దీనికి ఏం మాధానం చెప్తారని పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం గిరిజన మహిళ మృతి పై స్పందించి, వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే రోడ్డు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.