

బనగానపల్లె జనం న్యూస్ జనవరి 11
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో యోగి వేమన విశిష్టత తెలుగు భాషా విశిష్టత పుస్తక పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు ప్రపంచాన్ని ఆదర్శం అని ఆయన పద్యాల ద్వారా ప్రపంచానికి మంచి నీతి సందేశం అందించారని యోగి వేమన విశిష్టతను గురించి ఐదో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానంద చారి విజ్ఞప్తి చేశారు అమ్మ భాష యొక్క విశిష్టతను గురించి వివరించారు అనంతరం పుస్తకాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు విద్యుత్ శాఖ అధికారి కృష్ణమాచారి చంద్ర భాషా మద్దిలేటి రాముడు పకీర మొదలగు వారు పాల్గొన్నారు