

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా తెలుగు భాషాభి మానులు, సాహితీవేత్తలు, రచయితలు డా. పీవీ సుబ్బారావు, డా. దార్ల బుజ్జిబాబు ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ డెరైక్టర్, మాజీ ఏ జి పి, భారత ప్రభుత్వ నోటరీ, దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ అమృతమైనా తెలుగుభాషను మృత భాషగా చేయవద్దన్నారు. బాల్యం నుండే పిల్లలకు తెలుగుభాష సంస్కృతి పట్ల ఆసక్తి కలిగించాలని, పఠానాసక్తులుగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, గుంజి వీరాంజనేయులు, తుర్లపాడు మాజీ సర్పంచ్ వడ్లాన చంద్రం, జెర్రి పోతుల బుల్లీబాబు, బెజ్జం రవి, షేక్ బాజీ, బాషా, బత్తుల విక్రమ్, బాబురావు, తదితరులున్నారు.