

జనం న్యూస్ ఫిబ్రవరి 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాలలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలోని విద్యార్థుల యూనిఫారమ్ నిమిత్తం మురమళ్ళకు చెందిన నడింపల్లి సూర్య వర్మ రూ.30 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో దాత సూర్య వర్మను పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు, పిఈటి సాయి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్దులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.