

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట మండలంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణాల కొరకు పలు స్థలాలను పరిశీలిస్తున్న రాజంపేట తాసిల్దారు పీర్ మున్ని రాజంపేట పార్లమెంట్ బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ లు పరిశీలించారు ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ రాజంపేటకు 2016లో కేంద్రీయ విద్యాలయం మంజూరు అయ్యి క్లాసులు జరుగుతున్నాయి అని తెలిపారు అయితే కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా దాన్ని శాశ్వత భవనాల కోసం 20 కోట్లు నిధులు మంజూరు చేయించానని తెలిపారు అయితే సరైన స్థలం లేకపోవడంతో ఈ విషయాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని వివరించారు ఈరోజు కలెక్టర్ ఆదేశానుసారం రాజంపేట తహసిల్దారు పీర్ మున్ని స్థలాలు పరిశీలించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, ఇతర రెవెన్యూ అధికారులు మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు