

జనం న్యూస్. ఫిబ్రవరి 21. మెదక్ జిల్లా. నర్సాపూర్. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బివి.రాజు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ బివిఆర్ఐటి కళాశాలలో ఈ బాహా కేటగిరీ కోసం ఎస్ఏఈ బాహా సే ఇండియా 2025, ఈ కార్ రేస్ పోటీలు రెండొవ రోజు అట్టహాసంగా ముందుకు సాగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే తెలిపారు. ఈ పోటీలలో 85 టీమ్ జట్టులు దరఖాస్తు చేసుకున్నారనిఅందులో 77 విద్యార్థిని విద్యార్థుల టీమ్స్ సభ్యులు పాల్గొంటున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం -2, మహారాష్ట్ర -23, తమిళనాడు-17, తెలంగాణ-2, కేరళ-7, ఢిల్లీ-1, ఒడిశా-2, మధ్యప్రదేశ్ -5, ఉత్తరప్రదేశ్ -3, గుజరాత్ -4, కర్ణాటక-4, ఉత్తరాఖండ్ -1, త్రిపుర-1, కర్ణాటక-4, ఛత్తీస్గఢ్ -1, చండీగఢ్ -1, జార్ఖండ్ -1, జమ్మూ కాశ్మీర్ -1 హరియాణా-1 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. మన దేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన ప్రతిష్టాత్మక మైన విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, పేరొందిన యూనివర్సిటీ నుండి 77 విద్యార్థుల చేత సొంతగా డిజైన్ చేసుకొని వచ్చి వారి బగ్గీలలతో ఈ బాహా ఎస్ ఏ ఈ ఇండియా 2025 పాల్గొంటున్నారని అన్నారు. ఈ బగ్గీలకు సాంకేతిక తనిఖీలు, బ్రేక్ టెస్ట్, వర్షపు తుఫాను పరీక్షలు, డిజైన్ ఫైనల్స్, ఆవిష్కరణలు, ధ్రువీకరణ, ద్రోణాచార్య త్వరణం, డైనమిక్ సంఘటనలు నిర్వహించడం జరుగుతోందని ఆర్గనైజింగ్ కమిటీ ఇ బాహా సే ఇండియా తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే. శ్రీనివాస్ రెడ్డి. బాపిరాజు. కాంతారావు. మల్లికార్జున్. సురేష్. వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
