Listen to this article

నాషిరకమైన తినుబండ్రాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ పిబ్రవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కిరాణా షాపులు, హోటల్స్, టిఫిన్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, స్వీట్ హౌస్, బేకరీల లో ఇష్టాలు రాజ్యాంగ నాషిరకమైన తిను బండరాలు, సరుకులు, డేట్ అయిపోయిన వస్తువులను అమ్ముతున్నారు, ఎక్స్పైర్ డేట్ వాటర్ బాటిలను అమ్ముతు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, దీనికి తోడుగా జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు లేవు, దానితో షాపుల యాజమాన్యాల ఇష్టరాజ్యం అవుతుంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా లేకపోవడంతోటే షాపుల యాజమాన్యులు నాషిరకమైన తినుబండరాలు ఎక్స్పైర్ డేట్ అయినా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ పై మరియు షాపుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం టీ ఏ జి ఎస్ , ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి పత్రం సమర్పించారు,ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, టీ ఏ జీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, పాల్గొన్నారు