Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 22:(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విద్యార్థుల మనసులో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి టాలెంట్ టెస్టులు దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక (జె వి వి) జిల్లా గౌరవ అధ్యక్షులు వనమాల వెంకటేశ్వర్లు అన్నారు. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆదివారం 23వ తేదీన నిర్వహించే “సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడ పత్రికను జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈనెల 23వ తేదీ ఆదివారం రోజు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వేదికగా సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ తల్లాడ రామచంద్రయ్య తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొనవచ్చని తెలిపారు. సూర్యాపేట సైన్స్ ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వారి సౌజన్యంతో జనవిజ్ఞాన వేదిక (జె వి వి) వారు సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొనుటకు విద్యార్థులందరూ ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించకుండానే ఉచితంగా పాల్గొనవచ్చని తెలిపారు. టాలెంట్ టెస్ట్ కొరకు గూగుల్ ఫారం ద్వారా ttps://forms.gle/snTrAcJvEYYDoXM67 ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు పరీక్ష కన్వీనర్ ని, చరవాణి నెంబర్ 9912405371 లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా సీనియర్ నాయకులు వల్లపట్ల దయానంద్, మారం నారాయణరెడ్డి, డి. నాగరాజు, సోమ సురేష్ కుమార్, బి క్రాంతి కుమార్, అంకతి వెంకన్న, లింగమూర్తి, రావిరాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.