

జనం న్యూస్ ఫిబ్రవరి 21: నడిగూడెం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ కార్యదర్శుల బతుకులు భారంగా మారుతున్నాయి.ప్రధానంగా వారికి ఆర్థికపరమైన అంశాలు అప్పగించడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 30తో సర్పంచ్ల పాలన పూర్తయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు ఫిబ్రవరి 1 నుంచి పాలన బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.