Listen to this article

జనంన్యూస్. 22 : నిజామాబాదు. సిరికొండ. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పసుపు పంట క్వింటరుకు 12 వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు లేకపోతే కలెక్టరేట్లు ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. శనివారం రోజున జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆమె పర్యటించారు అక్కడ ఉన్న పసుపు రైతులను అడిగి సమస్యలను లుసుకున్నారు రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మార్కెట్లో పసుపు ధర ఎనిమిది వేల నుండి పదివేల వరకు మాత్రమే ఉన్నదని ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు 12 వేల రూపాయలు చెల్లించాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు దళారులు అధికారులు పాలకవర్గం సిండికేట్లుగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వరి పండించిన రైతన్నలకు బోనస్ డబ్బులు మొండి చేయి. కొంతమంది రైతులకు మాత్రమే బోనస్ డబ్బులు ఇచ్చి మేము ఇచ్చినము అని చెప్పుకోవడం అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి. మాత్రమే చెల్లుతుంది 3 నెలలు గడిచినా రైతులకు అందని బోనస్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్నవడ్లకు రూ.500 బోనస్ పథకం చాలా మంది రైతులకు ఇంకా అమలు కాలేదు ఓట్ల కోసం బోనస్ అని నమ్మించి ఇప్పుడు ఎగ్గొడుతున్నాడని.. రేవంత్ రెడ్డి పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు. త్రిలోకసంచారులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఇంకా 23 వేల మంది రైతులకు బోనస్ డబ్బులు రావల్సి ఉంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.25 కోట్లు, నల్గొండ జిల్లాలో రూ.18.59 కోట్లు, నిర్మల్ జిల్లాలో రూ.4.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చాలా మంది రైతులకు ఇంకా బోనస్ డబ్బులు జమ అవ్వలేదు బోనస్ డబ్బుల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుంటే విడతల వారీగా జమ అవుతాయని చెప్తున్నారు దీంతో బోనస్ బోగస్ అయినట్టే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు