Listen to this article

జనం న్యూస్ //జనవరి 11//కుమార్ యాదవ్..
కమలాపూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నేత కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకొని నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్న భీమా అనే మూడు పథకాలకు శ్రీకారం చుట్టి 168 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది అన్నారు.ఇందుకు చేనేత కార్మికుల పక్షానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,,,చేనేత జోలి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు,,కి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యర్ కి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి, రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేటర్ తవుటం రవీందర్ కి కృతజ్ఞతలు తెలియజెస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేనేత పారిశ్రామికులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది అని వివరించారు.అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటంతో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించమన్నారు.చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలతో చేనేత కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెల్లించడం జరుగుతుంది అన్నారు.ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరానికి 18 వేల రూపాయలు సహాయకునికి 6 వేల రూపాయలు మెయింటెనెన్స్ కింద చెల్లించడం జరుగుతుంది అని మాట్లాడారు.చేనేత సంఘాలకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు కూడా చెల్లించబడడం ద్వారా సంఘాలు మరింత బలోపేతం అవుతాయన్నారు.ఈ పథకాల ద్వారా నిరుపేద చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలియజేయడమైనది అని వివరించారు.ఇట్టి కార్యక్రమంలో చేనేత సంఘం మేనేజర్ సామల దామోదర్,నామని రమేష్,చేరాల కిషన్, మహేశ్వరపు రాజమౌళి,చేనేత కార్మికులు పాల్గొన్నారు.