Listen to this article

జనం న్యూస్ 22: ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :జైనూర్ కు చెందిన ఆత్రం శ్రీకాంత్ ఉట్నూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ ను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని,ఆరోగ్యంపై ఆరా తీసి ఆయనకు ధైర్యం చెప్పారు.. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఆమె వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వున్నారు.