Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 22: ముమ్మిడివరం ప్రతినిధి : మాతృభాషా దినోత్సవం వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సర్ ఎస్ ప్రసన్నశ్రీ ని గౌరవించుకుని సన్మానించడం జరిగిందని బీజేపీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి తెలిపారు. అలాగే ప్రముఖ కవి సాహితీవేత్త, విశ్వనాథ సత్యనారాయణ శిష్యులు కీర్తిశేషులు నండూరి కృష్ణమాచార్యులు కోడలు నండూరి జయలక్ష్మి ని భాషని గౌరవించుకునే భాగంలో వారిని కూడా సన్మానించటం జరిగిందని నీరుకొండ వీరన్న చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమల్లి ఛారిటీ ట్రస్ట్ చైర్మన్ నల్లమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.