

భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆంధ్ర యువకుడు ఏలుసూరి శివకోటి నందలూరు వాసి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 3 టి20ల్లో 72 పరుగులు చేసి, 11 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికైన శివకోటి వెన్నంటే ఉండి సహాయసహకారాలు అందించిన నందలూరు మండల వాసులకు కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి సహాయం చేసిన ప్రతి ఒకరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసినశివకోటిశనివారం నాడు బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ భారత జట్టు క్రీడాకారుడు ఏలుసూరి శివకోటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఫిబ్రవరి 14 నుండి 20వ తేదీ వరకు బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ ఇండియా ఆధ్వర్యంలో నేపాల్ లో జరిగిన ఇండో-నేపాల్ 3 మ్యాచ్ ఫ్రెండ్షిప్ టి20 సిరీస్ లో నేపాల్ జట్టుపై భారత్ జట్టు అన్ని టి20 లను క్లీన్ స్వీప్ చేసి సిరీస్ కైవసం చేసుకుంది..ఈ సిరీస్ లోఆడిన మూడు మ్యాచ్ లోనూ తాను అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 11 వికెట్లు తీయడమే గాక 72 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపిక కావడం జరిగింది అని తెలిపాడు ఏలుసూరి శివకోటి చివరి మ్యాచ్ లో కెప్టెన్ గా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని అద్భుతమైన కెప్టెన్సీ తో భారత్ జట్టును ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చానన్నాడు.నందలూరు మండలం యొక్క కీర్తి ప్రతిష్టతలను దేశం గర్వించే విధంగా నలువైపులా చాటు తున్నానన్నాడు యొక్క క్రీడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంత స్థాయికి రావడానికి సహకరించిన నందలూరు మండల వాసులందరికీ మరియు సహాయ సహకారాలు అందించిన ప్రజా ప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలుతెలియజేసాడు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతానని ఆత్మవిశ్వాసంతో ఆశాభావం వ్యక్తం చేశాడు.తనకు శిక్షణ ఇచ్చి మేలుకువలు నేర్పిన క్రికెట్ కోచ్ లందరికీ, బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి, కడప డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి, నందలూరు సబ్ సెంటర్ క్రికెట్ అసోసియేషన్ కి మరియు తన యొక్క క్రీడా జీవితాన్ని వార్తాపత్రికల్లో ప్రచురిస్తూ, తన యొక్క ఎదుగుదలకు కారణమైన నందలూరు మండల పాత్రికేయ విలేకరులందరికీ సవినయంగా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాడు. నన్ను ఆదర్శంగా తీసుకొని మరింత మంది క్రీడాకారులు తయారవ్వాలని మరియు మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శివకోటి గట్టి పట్టుదలతో ఘంటాపథంగా చెప్పడం జరిగింది.
