

జనం న్యూస్ 22: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పాత రైల్వే క్వార్టర్స్ సమీపంలో అరెస్ట్ చేశామని విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వన్ టౌన్ పోలిస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దాసన్నపేటకు చెందిన బి.నవీన్, రాయఘడ్‌కు చెందిన సంతోశ్ ఒడిశాలో గంజాయి కొని విజయనగరం తీసుకువచ్చారన్నారు. ఎస్‌ఐ రేవతికి అందిన సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేసి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.