

యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్
జనం న్యూస్ //ఫిబ్రవరి //22//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది. నేరుగా ఓటర్లను మరియు వారి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది.ఈ దర్భంగా, పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ నమూనాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి క్రమ సంఖ్య.2 వద్ద 1 వేసి, మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని పట్టభద్రుల సంక్షేమానికి పాటుపడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మోలుగురి సదయ్య, సీనియర్ నాయకులు నరిగే సుమన్, పొనగంటి రవి, రాజ కొమురయ్య, నగంటి కుమార్, బిట్ల మోహన్, దేవేంద్ర చారి, యువజన నాయకులు అజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
