

జనం న్యూస్, ఫిబ్రవరి22, అచ్యుతాపురం: ఉపాధ్యాయ శాసనమండలికి జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి కూటమి మద్దతు ఇచ్చిందని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలంభవాని భాస్కర్, బిజెపి సన్యాసినాయుడు మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు ఎన్నికల పరిశీలకులతో కలిసి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయాంలోనే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో టిడిపిని గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం హయాంలో జరుగుతున్న ఎన్నికలలో కూటమి మద్దతు ఇస్తున్న పాకలపాటి రఘువర్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జనసేన,టీడీపీ,బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.