Listen to this article

  ముస్తాబైన శ్రీవీరభద్రేశ్వరస్వామి దేవాలయం

జనం న్యూస్ 22 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని కంకల్ గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) కార్యక్రమాలు 23/02/2025 వ తేది నుండి మార్చి 01/03/2025 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 23/02/2025 వతేది ఆదివారం ధ్వజారోహణం, 24/02/2025 వ తేది సోమవారం గీతాయజ్ఞము, పారాయణము, 25/02/2025 వ తేదీ మంగళవారం మృత్యుంజయహోమం, రుద్రహోమం 26/02/2025 వ తేదీ బుధవారం మహాశివరాత్రి, రుద్రాభిషేకం, 27/02/2025 వతేది గురువారం తెల్లవారుజామున అగ్నిగుండము, 28/02/2025 వ తేది శుక్రవారం శ్రీస్వామివారి రథోత్సవము, రాత్రికి వీరభద్రవిజయం (ఆటా) ఉంటుందన్నారు. మార్చి 01/03/2025 వ తేదీ శనివారం పార్వతీపరమేశ్వరుల కళ్యాణం, రాత్రికిసేవ, మానసపూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాలు శ్రీ వెంకటదాసుల వారి ఆధ్వర్యంలో జరుగును. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాల్లోని ఆయా గ్రామాలకు చెందిన భక్తులు భారీసంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.