

జనం న్యూస్ జనవరి 12(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు పంచాయతీ కార్మికుల అందరికీ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది, ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా, ఎస్సై నాగస్వామి హాజరై నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అతిథులు మాట్లాడుతూ బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో బాల రామాంజనేయులు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా వజ్రకరూరు గ్రామంలో కార్మికులుగా పనిచేస్తూ ఊరి బాగుకోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తూ అలాంటివారికి సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని నిశ్చయించుకుని వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషదాయకం అని తెలియజేశారు, మాల మహానాడు రామాంజనేయులు మాట్లాడుతూ మా వజ్రకరూరు గ్రామంలో పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సమస్యలు రాకుండా గ్రామ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న మా కార్మికులందరికీ నా వంతుగా సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం నా వంతు నేను అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగ శంకర్, పారిశుద్ధ కార్మికులు,తదితరులు పాల్గొన్నారు