

జనం న్యూస్ ఫిబ్రవరి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బ్జెక్ట్ గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును నియోగించుకునేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ ఆంజనేయులు ఉన్నారు.
