

జనం న్యూస్ డిసెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు బిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ ఎకరానికి 15000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను మోసం చేసి గెలిచినంక ఇప్పుడు హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని హామీలు అమలు చేయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసినాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు గుండగని రాములు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.