

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్నేహశీలి, మృదుస్వభావి, మనందరి వాడు అయినా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన పిలుపు మేరకు . పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీల నాయకులు నేడు నాడు కూటమి పార్టీల నాయకులు, కృష్ణవేణి స్కూల్ క్యాంపస్ లు,మోడరన్ , బ్రిలియంట్ ,విజ్ఞాన్ విహార్ తదితర ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వారి అనుబంధ వర్గాల వారినీ కలిసి, ఈనెల 27వ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఆ సందర్భంగా కూటమి పార్టీల నేతలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాసన మండలి లో కూడా మనకు బలం ఉండాలని,విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యలపట్ల అవగాహన అనుభవం పోరాట తత్వం కలిగిన సీనియర్ రాజకీయ నాయకులు మాజీ సాంకేతిక శాఖ మంత్రి విద్యావేత్త విలువలతో కూడిన రాజకీయాలను, మన సంస్కృతి సాంప్రదాయాలు రైతంగా సమస్యల పట్ల పూర్తి అంకితభావం కలిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను శాసన మండలికి పంపించేందుకు మనమందరం సన్నద్ధం కావాలని, తెలుగుదేశం, జనసేన, బిజెపి, బలపరిచిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసేందుకు పట్టభద్రులు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, న్యాయ వ్యవస్థల్ని కూడా తప్పుదారి పట్టించి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాసిందని మండిపడ్డారు, న్యాయ వ్యవస్థలో కూడా అనేక మార్పులు రావలసిన అవసరం ఉందని ఇవన్నీ సాధ్యపడాలంటే విలువలతో కూడిన వ్యక్తులను మండలికి ఎంపికైనప్పుడే ధ్యపడుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి విజ్ఞులైన పట్టబద్రులు న్యాయవాదులు డాక్టర్స్ పాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు మంచి ఆలోచన చేసి సమాజ హితం కోరే సాంప్రదాయతర రాజకీయ నాయకులను ఓటు వేసి మద్దతు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి,తాటి పర్తి జయరామిరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరి సదాశివరావు. మక్కేనా నరసింహారావు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్ ఎస్, సుభాని,పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధ్ధు మాల రవి,గోగినేని నాగేశ్వరావు, తుబాటి శ్రీ హరి,జన సేన నాయకులు,మునిర్, భాషా, సుభాని,టీడీపి నాయకులు అరే మల్లి,శిరీష్, తదితరులు పాల్గొన్నారు