Listen to this article

జనం న్యూస్. ఫిబ్రవరి 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) గుమ్మడిదల్ల మండలంలోని నల్లవల్లి ప్యారానగర్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో జేఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్ష కార్యక్రమం ఐదవ రోజుకు చేరుకున్న సందర్భంగా అఖిల పక్ష నాయకుల సమ్మెకు మద్దతుగా దీక్షా శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డుతో నర్సాపూర్ నియోజకవర్గానికి శాపంగా మారుతుందని. పచ్చని అడవిలో చిచ్చుపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతి ఆదివారంనాడు హైదరాబాద్ నగరం నుండి ఎంతో మంది ప్రజలు స్వచ్ఛమైన గాలికోసం సెదతీరడానికి ఇక్కడికి వస్తుంటారని గుర్తు చేశారు, నర్సాపూర్ రాయరావు చెరువును కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు, డంపింగ్ యార్డ్ తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోగ్య పరంగా చాలా నష్ట పోతారని చెరువులోని చాపలు మరణించడం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్యారా నగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనులను ప్రభుత్వం నిలిపివేసే వరకు కలిసికట్టుగా పోరాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గప్పగారి సత్యం గౌడ్, గోడ రాజేందర్,బిక్షపతి,సద్దాం, అఖిలపక్ష నాయకులు సిరుమని గంగారాం, దన్ సింగ్ ,గోపి, ప్రభు,భూషణం, మనయ్య, యేసురత్నం,నర్సింగ్ రావు,దుర్గేష్, దుద్యాల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు