Listen to this article

జనం న్యూస్; 22 ఫిబ్రవరి శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ఆదివారం 23 ఫిబ్రవరి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తడకపల్లి ఆవాస విద్యాలయమునందు డాక్టర్ నలవోలు నరసింహారెడ్డిచే పద్య సాహిత్య కార్యశాల మరియు ప్రముఖ పద్యకవి ఎండి. షరీఫ్ రచించబడిన ”నీరాజనం” పద్య ఖండకావ్యం ఆవిష్కరణ మహోత్సవము కలదని జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, సభ్యులు నల్ల అశోక్, ఎల్లమ్మలు తెలిపారు. సాహిత్య కార్యశాల, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సాహితీ మిత్రులు, సాహితీ ప్రియులు, కవులు, రచయితలు విచ్చేసి సభను దిగ్విజయం చేయగలరన్నారు.