

కుళ్ళిన మాంసం, చికెన్ , తినుబండారాలు లభ్యం జనం న్యూస్ పీబ్రవరి 22 ఆసిఫాబాద్ జిల్లా జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. స్థానిక కాకతీయ, శ్రీసాయి హోటల్, మైఫిల్ హోటల్లో తణిఖీలు చేపట్టడం జరిగింది. మైఫిల్ హోటళ్ళో నిలువ ఉంచిన మాంసం, చికెన్, పలు తినుబండారాలు బయటపడటంతో హోటల్ యజమానికి అధికారులయ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హోటలలో అపరిశుభ్రత కలిగిన, కల్తీ ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇకపై తరచుగా ఆకస్మిక దాడులు కొనసాగుతాయని విక్రయదారులు ముఖ్యంగా హోటల్స్ నడిపేవారు ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని ఆహారాన్ని అందించాలని లేనిచో వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.