

వాజేడు ఎస్ఐ రాజ్ కుమార్ తో కేక్ కట్ చేయింసిన తెలంగాణ సమాజం ప్రతినిధి గుడివాడ గణేష్
పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో తెలంగాణ సమాజం దినపత్రిక రెండోవ వార్షికోత్సవం సందర్భంగా వాజేడు మండల రిపోర్టర్ గుడివాడ గణేష్ వాజేడు పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ అక్షరం ప్రజల పక్షం అనే వినాదంతో ముందు కొచ్చి ప్రజల మనుసులో చెరగని ముద్రవేసి వాస్తవాలను పాఠకులకు, ప్రజలకు, ప్రభుత్వాలకు అందించడంలో ముందంజలో నడుస్తూ అనతి కాలంలోనే అత్యంత ప్రజాధరణ పొంది ఎక్కువ మంది పాఠకులను సంపాదించుకున్న పత్రిక తెలంగాణసమాజం దినపత్రిక అని కొనియాడారు. అనంతరం తెలంగాణ సమాజం దినపత్రిక వాజేడు మండల ప్రతినిధి గుడివాడ గణేష్ ఎస్ఐ రాజ్ కుమార్ కు, మండల అధికారులకు, నాయకులకు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు. జనంన్యూస్ రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు. అట్టం రామ్మూర్తి. కుమ్మరి సారబాబు పాల్గొన్నారు