

చిన్నగొట్టిగల్లు ఫిబ్రవరి 22 జనం న్యూస్: లోపించిన పారిశుధ్యానికి నిలువెత్తు సాక్ష్యం…. జంగావాండ్లపల్లి పంచాయతీ,మారసానివారిపల్లి తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్. రెండెండ్లు గడుస్తున్నా గాని శుభ్రం చేయలేని పంచాయతీ కార్యదర్శి పనితీరు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఒకవైపు మారసానివారిపల్లి ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నను ,మరోవైపు ఆ గ్రామస్తుల తాగునీటి ఇబ్బందులు మరికొందరికి పరిహాస ధోరణి గా మారింది. ఏదైతేనేమి ఆ ఊరి ఓవర్ హెడ్ ట్యాంకు కు పైపులైన్ల ద్వారా నీటిసరఫరా సౌకర్యాన్ని కల్పించకపోవడంతో తాగునీటి ట్యాంకు లో మీటర్లు కొద్ది వ్యర్ధమైన మలినాలతో నిండుకుపోయిందన్నారు . ఇంత జరుగుతున్నా గాని పంచాయతీ సచివాలయం కార్యదర్శి మాత్రం గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంలో పూర్తిగా విఫల మయ్యారని మాజీ సింగల్ విండో అధ్యక్షుడు ముత్తం ప్రభాకర్ ఆరోపించారు. రెండేండ్లు గడుస్తున్నా తన గ్రామమైన మరసానివారిపల్లి ఓవర్ ట్యాంక్ ను శుభ్రం చేయకపోవడం వెనక దాగివున్న వున్న అంతర్యమేమిటని ఎదురు ప్రశ్న వేశారు. తాత్కాలికంగా తాగునీటి సౌకర్యాన్ని కల్పించేలా కంటతుడుపు చర్యలు చేపట్టడం వారికే చెల్లుబాటుగా మారిందన్నారు.పారిశుద్ధ్య పనుల కోసం కేటాయిస్తున్న ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించడానికే సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణి ని ప్రదర్శిస్తున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయ వైశమ్యాలను పక్కనపెట్టి పంచాయతీ సిబ్బంది మారసాని వారి పల్లి తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ శుభ్రం చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తే తమ గ్రామప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉంటారన్నారు. ఇప్పటికైనా తమ గ్రామస్తులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించేలా ఓవర్ హెడ్ ట్యాంక్ ను శుభ్రం చేసి తద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.