Listen to this article

జనం న్యూస్ జనవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

సద్వినియోగం చేసుకోవాలని కోరిన టి యు డబ్ల్యూ జే జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు*
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు ఓ ప్రకటనలో తెలిపారు. బండారు అస్పత్రి ఆధ్వర్యంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుశ్రుత్ పర్యవేక్షణలో వైద్య శిబిరం జరుగుతుందన్నారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది జర్నలిస్టు వృత్తిపరమైన ఒత్తిడిలకు లోనై గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత గుండె సంబంధిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉచితంగా ఈసీజీ, టుడి ఈకో, ఆర్ బి సి లతోపాటు అవసరమైన ఇతర వైద్య పరీక్షలను నిర్వహిస్తారని తెలిపారు. వివేకానంద నగర్ లోని బండారు ఆసుపత్రిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలను చేయించుకోవాలని కోరారు