Listen to this article

జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెలలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ నేతలు శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపించారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఉపాధ్యాయులకు మంచి వ్యక్తిని ఎన్నుకునేంత ఆలోచన ఉంటుందని అన్నారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం యూనియన్లను ప్రభావితం చేస్తున్నారని, ఎన్నికల అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు.