

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మాదక ద్రవ్యాల నియంత్రణకు, ప్రజలను మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు విజయనగరం జిల్లా పోలీసుశాఖ అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ చైతన్యపరుస్తున్నారు. దీనిలో భాగంగా మాదక ద్రవ్యాలను దూరం చేసేందుకు గాను ప్రత్యేకంగా రూపొందించిన ‘మార్పు’ అనే నినాదంతో రూపొందించిన వీడియోను మరియు పోస్టర్లును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 22న జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ, వ్యసనపరులుగా మారుతున్న యువతను మత్తు, మాదక ద్రవ్యాలకు దూరం చేయడానికి జిల్లా పోలీసుశాఖ తమవంతు కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా తరుచూ సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని కళాశాలలను సందర్శించి, యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు స్నేహాల ప్రభావం, ఒత్తిడితో డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడవద్దని అవగాహన కల్పిస్తున్నారని, మార్పు కోసం తమ వంతు సహకారాన్ని అందించి, మాదకద్రవ్యాల రహిత భవిష్యత్తును ఎంచుకోవాలని, మీ సామర్ధ్యం అపరిమితం దాన్ని డ్రగ్స్ కోసం వృధా చేసుకోవద్దని జిల్లా ఎస్పీ కోరారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు గురించి ఏదైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే టోల్ ప్రీ నెంబరు 1972 కు తెలియజేయాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకోవడం వలన యువత వారి జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో, వాటి వలన కలిగే అనర్ధాలను తెలియపరుస్తూ మాదకదవ్రాలు నుండి ప్రజలను యువతను దూరం చేసేందుగాను విజయనగరం 2వ పట్టణ పోలీసులు మరియు కొంతమంది యువత కలిసి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన వీడియోను మరియు పోస్టరును జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం ఈ వీడియో రూపకల్పనలో పాల్గోన్న విజయనగరం పట్టణానికి చెందిన నవీన్ మరియు వారి టీమ్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్లును అందజేసారు. ఈ వీడియో మరియు పోస్టరు చిత్రీకరణలో సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు
ను కూడా జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ పోస్టరు, వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు మరియు సాంకేతిక సహాయకులు నవీన్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.