

జనం న్యూస్ 23 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ బిసి లో హక్కుల సాధనకు మార్చి 12,13 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బిసి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నడిపేన శశి భార్గవి, ఉత్తరాంధ్ర అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం జమ్ము లో వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లో బిసి ల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. బిసి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి అభివృద్ధి కి చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం బిసి ల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వివరించారు. గత పాలకుల హయాంలో బిసి కార్పొరేషన్ పదవులు ఇచ్చి నిధులు ఇవ్వకుండా సంక్షేమం విస్మరించారని పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ బిసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గా ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బిసి ల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి బిసి మహిళలు కు రాజకీయాల్లో రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉంది, బిసి కులాల గణన చేసి ఏఏ బిసీ సామాజిక వర్గాలు ఎంత శాతం మంది ఉన్నారో సరైన గణాంకాలు లేవు వాటిని సాధించడానికి అవసరమైన పోరాటం చేస్తామని చెప్పారు.ఇందుకోసం మార్చి లో 12,13 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బిసిల హక్కుల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే కళాశాల విద్యార్థులను కలిసి చైతన్య పరుస్తూ వారిలో విద్య పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ముందు కు తీసుకెళ్తామని తెలిపారు. ఏ పదవిలో ఉన్నా ప్రజలు కోసం పని చేయడం, కూటమి ప్రభుత్వం బాటలో బిసి ల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బిసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరాడ రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్తి వీరు వెంకట సత్యనారాయణ, ఆల్తి చిట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.