

జనంన్యూస్. 23. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల సందర్బంగా నగరంలో ఓల్డ్ కలెక్టర్ మైదానం మరియు అమరవీరుల పార్క్ లో బిజెపి బలపరిచిన అభ్యర్థుల తరుపున అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో వీరులు ఆత్మబలిధానం చేసుకుంటే వారి త్యాగాలను, ఆశయాలను తుంగలో తొక్కిన బీఆర్ఎస్ ను బొంద పెడితే అదే తోవలో పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వనికి కూడ మేధావులు, విద్యావంతులు ఓటుతో తగిన బుద్ది చెప్పాలన్నారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలు ఎన్ని అమలు చేసారో ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు, హామీలలో అమరవీరుల కుటుంబాలకు 25 వేలు , యువతకు ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు 4వేల భృతి, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 15వేలు,18 సంవత్సరాలు నిండిన యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీ, విద్య భరోసా ఇవన్నీ ఉత్తుత్తి హామీలేనా అని ప్రశ్నించారు.ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక వారి పదవి కాలాన్ని పెంచి వారి నేత్తిమీద భారం మోపుతూ మరో పక్క నిరుద్యోగత పెంచిన బీఆర్ఎస్ తోవాలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు . 317 జీవోకు వ్యతిరేకంగా బిజెపి పోరాడి లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు పోయిన సందర్బన్ని గుర్తు చేసారు.మండలిలో నిరుద్యోగుల తరుపున, టీచర్ల సమస్యల తరుపున ప్రశ్నించే గొంతుకలు కావాలి కానీ గులాంగిరి చేసే గొంతుకలు కాదాన్నారు. నిరుద్యోగ యువత, టీచర్స్ పక్షాన పోరాడే బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు అంజిరెడ్డి కి, మల్క కొమురయ్య కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.