

జనం న్యూస్ ఫిబ్రవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ కూకట్పల్లి షోరూంలో ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువలరీ ఆభరణాల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ బంగారం వజ్రాభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని దాతనంతో కూడిన వని నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తూ ఈ షో యొక్క సందేశం ని బలపరుస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ షానిబ్ షోరూం హెడ్ శ్రీనివాస్ వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.