

జనం న్యూస్ // ఫిబ్రవరి // 23//జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కేశవాపురం గ్రామానికి చెందిన పుల్ల రవి -మౌనిక దంపతుల మార్కస్ నివాన్ ,రూఫస్ నివాన్ ఇద్దరి కుమారుల పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలోని అనాధ పిల్లల సమక్షంలో జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణంలోని బస్టాండ్ పరిధిలో పిఎంఆర్ కంప్యూటర్ సెల్స్ అండ్ సర్వీస్ షాప్ నడిపిస్తూ జీవనం కొనగిస్తున్ననని, తన ఇద్దరు కుమారుల పుట్టినరోజు వేడుకలను అనాధ ఆశ్రమంలో ఈ పిల్లలతో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని, అభం శుభం తెలియని ఇలాంటి పిల్లలకి ఒక్కపూటైనా ఆహారం అందించాలని, ఆశ్రమంలో కేక్ కటింగ్ చేయించి పండ్లు పంపిణీ చేశామని సేవా దృక్పథం కలిగి ఒక ఆశతో తమ కుమారుల వేడుకలను ఇలా జరిపించానని ఆయన తెలిపారు.