Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి (23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో పంట పొలాలు నీరు లేక ఎండిపోతుండడంతో రైతులు పొలాలను పశువులు, గొర్రెలతో మేపుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ జలాలు అందాయని ప్రస్తుతం కాలువ చివరి వరకు నీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోవడంతో చాలా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలువ ద్వారా మీరు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.