Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. NSIC -(నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ చాలెంజ్,) సీజన్ 8 లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ఫైనల్స్ లో మరొక్కసారి గొబ్బిళ్ళ అక్షర స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ చాటారు విద్యార్థినిలు ఎన్ లక్ష్మీ చైతన్య మరియు ఎస్ జైనబ్ లు14 పైగా రాష్ట్రాల విద్యార్థినిలతో పోటీపడి మొదటి బహుమతి గోల్డ్ మెడల్ మరియు క్యాష్ రివార్డు సాధించారు ఏ విద్యాలోకా ఆధ్వర్యంలో LTI మైండ్ ఫ్రీ సహకారంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైనల్స్ లో నందలూరు లాంటి చిన్న గ్రామాల నుండి జాతీయ స్థాయి వేదిక వరకు గొబ్బిళ్ళ అక్షయ స్కూల్ విద్యార్థినిలు తమ అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచి ఆల్ ఇండియా నెంబర్ 1 గా ర్యాంకు సాధించడం పట్ల ఇటు గ్రామ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు కూడా గర్వకారణమని కొనియా డారు గత నాలుగు నెలల పాటు వివిధ దశలలో సాగిన NSIC -2025 సంవత్సరం ప్రయాణంలో పిల్లలకు శిక్షణ ఇచ్చి వారి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన A. వరప్రసాద్ ని గొబ్బిళ్ళ అక్షర స్కూల్ చైర్మన్ త్రినాథ్ మరియు కరస్పాండెంట్ గొబ్బిళ్ళ శ్రీనాథ్ ప్రత్యేకంగా అభినందించారు ఫైనల్స్ కు వెళ్లే ముందు గొబ్బిళ్ళ అక్షర స్కూల్ పిలుపుమేరకు స్పందించి చిన్నారులను ఆశీర్వదించిన వేలాదిమంది శ్రేయోభిలాషులకు మా కృతజ్ఞతలు.