Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి22 :నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలంలోనిబట్టాపూర్ గ్రామంలో గతఐదురోజుల క్రితం ప్రారంభమైనమండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు శనివారం తో ముగిశాయి.మొత్తం పదహెను జట్లు పాల్గొనగానాగంపేట్ గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు మొదటి బహుమతి గా పదివేల నగదు కప్పు, ద్వితీయ బహుమతి బట్టాపూర్ గ్రామజట్టు క్రీడాకారులకు ఐదు వేల నగదు కప్పు ఆందుకున్నారు. బహుమతులను గ్రామానికి చెందిన బాంపల్లిరాజు రెడ్డి, స్థానిక యువకులు దయానంద్, ప్రవీణ్ యాదవ్ అందజేశారు.ఈ కార్యక్రమం లో క్రీడాకారులు అజీమ్, నరేందర్ యాదవ్,వర్షిత్ గౌడ్, గణేష్, సాయి, పవన్ గౌడ్, సతీష్ గౌడ్, సాయి కృష్ణ, తదితరులు, పాల్గొన్నారు.