

జనం న్యూస్, ఫిబ్రవరి 24,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీవాణి స్కూల్‌లో మ్యాజిక్ డే సందర్భంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ మ్యాజిక్, వెంట్రిలాక్విజం కళాకారుడు వై.రమేష్ ని పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మెమొంటో అందించి , ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మ్యాజిక్ ఒక కళ మాత్రమే కాకుండా, సమాజానికి వినోదాన్ని అందించే గొప్ప సాధనం. మ్యాజిక్ కళా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.