Listen to this article

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, ఫిబ్రవరి 23, (రిపోర్టర్ ప్రభాకర్):నియోజకవర్గంలోని తెదేపా నాయకులంతా కలిసి కట్టుగా పనిచేసి ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఉమ్మడి ఎంఎల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి శాననమండలికి పంపించాలని ఎంఎల్సీ ఎన్నికల అబ్సర్వర్లు బొడ్డి పైడిరాజు, సిహెచ్ రామ్మోహన్ నాయడు, టిడిపి పట్టణ సీనియర్ నాయకులు బార్నాల సీతారాంబోను చంటి, రౌతు వేణు, గుండ్రెడ్డి రవికుమార్ కోరారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అదేశాల మేరకుపార్వతీపురం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎంఎల్సీ ఎన్నికల అబ్సర్వర్లు తెదేపా ముఖ్య నాయకులతో ఎంఎల్సీ అభ్యర్థి గెలుపుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధ్యాయ పట్టభద్రులను కలుసుకొని తమ మద్దతు తో ఎన్నికల బరిలో ఉన్న రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మేధావంతులైన ఉపాధ్యాయులకు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి వివరించి అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా పార్టీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజక వర్గంలోని ముఖ్య తెదేపా నాయకులు, జనసేన, బిజెపి పాల్గొన్నారు