Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అబద్దాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిందని అందుకే ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని బిఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు కూకట్ పల్లి నియోజక వర్గంలోని బాలనగర్ డివిజన్ లో గిరి సాగర్ రాజు సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మధు ఆధ్వర్యంలో వందమంది యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. యువకులందరికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన 14 నెలల్లో నియోజకవర్గానికి మొండిచేయ్యే చూపిందని ఎమ్మెల్యే అన్నారు సంక్షేమ పథకాలు అందిస్తామని మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్లు నాలుగు వెలు రూపాయలు అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ యువకుల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు మధు మాట్లాడుతూ ఏదో జరుగుతుంది కాంగ్రెస్ ఎంతో అభివృధి చేస్తారని ఊహించమని కానీ మాటలకే పరిమితమయ్యారు తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృధి చేయలేదని తేలిపోయిందని అందుకే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృధి చెందాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మధు అన్నారు.