

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ..హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్,నాయకులు,కో-ఆర్డినేటర్ లతో ప్రత్యేక సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి మెజారిటీ వచ్చేలా కృషి చేయండి..-సిఎం రేవంత్ రెడ్డి సభకు పట్టభద్రులు తరలిరండి.
జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరును ఓటు వేసేలా చూడాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మీడియాతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నాలుగు జిల్లాలకు సంభందించిన ముఖ్యమైన ఎన్నిక అని నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మెజారిటీ ఇవ్వాలని కోరారు.రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మంజూరు చెపిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ బలోపేతం చేస్తే,బీజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తూ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.నిరుద్యోగులతో పాటు 317 జీవోలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ విషయంలో ముందుకు వెళ్తున్నామని,అన్నారు.ప్రభుత్వ,ప్రయివేటు రంగాల్లో ఉద్యోగకల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉందని,ఇటీవల దావోస్ పర్యటనలో లక్షా డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని దీనిద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయనీ తెలిపారు.సోమవారం జరిగే పట్టభద్రుల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ ఎన్నికలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి హుజురాబాద్ నుండి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరారు.
