Listen to this article

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్. నిజామాబాదు జిల్లా.ధర్పల్లి మండలం దుబ్బాక అడవి ప్రాంతంలో నలుగురు యువకులు ఇద్దరు యువతులపై లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భీంగల్ ఏరియా కార్యదర్శి వి బాలయ్య డిమాండ్. దాడి నుంచి ఒక మహిళ తప్పించుకొని రోడ్డుపై రావడంతో అక్కడ ఉన్న రైతుకు చెప్పడంతో అతను గ్రామంలో సమాచారం ఇవ్వడంతో గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి వెళ్లి సరికి దాడికి పాల్పడిన వారు తప్పించుకున్నారు కారు డ్రైవర్ను పట్టుకొని ధర్పల్లి పోలీసులకు అప్పగించారు ధనంబండకు చెందిన యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు తెలిసింది వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. దారి వెంట వస్తున్న యువతులను మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకొని దుబ్బాక దనంబండ మధ్యలో ఉన్న నల్లగుట్ట సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేయడం శోచనీయం. స్త్రీలపై జరుగుతున్న అఘైత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించకపోవడమే వలనే నిత్యం అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి, స్త్రీలకు సంబంధించి ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిన స్త్రీలపై ఘోరాలు ఆగడం లేదు భారతదేశంలో ప్రజా ప్రతినిధులు అయిన ఎంపీ ఎమ్మెల్యేల పైన 150 కేసులు మహిళపై నేరాలు సంబంధించిన కేసులు ఉండడం బాధాకరం ప్రజా ప్రతినిధులు స్త్రీలపై అగైత్యాలకు పాల్పడం వలెనే వారు స్త్రీలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు స్త్రీ ఎక్కడైతే పూజింప పడుతుందో అక్కడ రక్షణ ఉంటుంది కానీ ప్రస్తుతం స్త్రీని ఆట బొమ్మగా చూడడం వలన ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు వెంకటి ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ తదితరులు పాల్గొన్నారు.