Listen to this article

జనం న్యూస్ 24: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకే తమ మద్దతు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా జనసేన అండగా నిలుస్తుందో.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకే మాటపై నిలబడాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు రఘువర్మకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లు పడేలా చూడాలన్నారు.