Listen to this article

250 మంది రోగులకు మందులు పంపిణీ.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో కీళ్ల ఎముకలకు బంధించిన ఉచిత బిఎండి క్యాంపులు వైద్యులు డాక్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి దాదాపు 250 మంది రాగ వారికి కీళ్ల ఎముకలకు సంబంధించిన సాంద్రత పరీక్షలు నిర్వహించడం తో పాటు ఉచితంగా ఓపి నిర్వహించి అవసరమైన సూచనలను సలహాలను డాక్టర్ రాజేష్ అందజేశారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువగా కాయ కష్టం చేయడం వల్ల వారి ఎముకల్లో ఉన్న సాంద్రత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వాటి పరీక్ష నిర్వహించటానికి దాదాపు 2500 రూపాయల వరకు ఖర్చు అవుతాయని దీనిని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో బిఎండి క్యాంప్ నిర్వహించడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ తెలిపారు. దీంతోపాటు ఎక్సరే, షుగర్ టెస్ట్, రక్త నమూనా పరీక్షలను అవసరమైన వారికి చేయడం జరిగిందని పేర్కొన్నారు.